మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ, హుషారు లాంటి చిత్రాలు నిర్మించిన బెక్కం వేణుగోపాల్.. ప్రస్తుతం ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రూపొందిస్తున్నారు. దీవెల శ్రీనివాస రావుతో కలిసి ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రంతో సాయితేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ మూవీకి ‘15 ఎమ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బెక్కం వేణు గోపాల్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. హీరో, హీరోయిన్ సహా ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

