నర్సింగ్ హాస్టల్‌ లో ఫుడ్ పాయిజన్..16 మంది విద్యార్థినులకు అస్వస్థత

నర్సింగ్ హాస్టల్‌ లో ఫుడ్ పాయిజన్..16 మంది విద్యార్థినులకు అస్వస్థత
  •     పీఎంఆర్ కాలేజీలో ఘటన 

చేవెళ్ల, వెలుగు:  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్నం మహేందర్​రెడ్డి దవాఖానకు సంబంధించిన బీఎస్​సీ నర్సింగ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ తో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి హాస్టల్ లో భోజనం చేసిన విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో దవాఖానకు తరలించారు. డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి చికిత్స చేస్తున్నారు. 

ఆదివారం ఉదయం వండిన చికెన్‌ను రాత్రి భోజనంలో వడ్డించడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థినులు ఆరోపిస్తుండగా.. బయటి ఆహారం తినడం వల్లే ఫుడ్ పాయిజన్​జరిగిందని నర్సింగ్​కాలేజీ యాజమాన్యం అంటోంది.  డీఎంహెచ్​వో డాక్టర్​ కల్యాణ్​ చక్రవర్తి, ఏవో మహమ్మద్​ షఫీయుద్దీన్​ విద్యార్థినులను పరామర్శించారు. ఫుడ్​ పాయిజన్​కు కారణాలను విద్యార్థినులతో పాటు హాస్టల్ అధికారులు, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.