రష్యాలో విమానం కూలి 16 మంది మృతి

 రష్యాలో విమానం కూలి 16 మంది మృతి

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. తతర్‌స్తాన్‌లో ప్రావిన్సుల్లో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా..ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ఉన్నట్లు సమాచారం. పారాచ్యూట్ జంపర్లతో ఎల్ 410 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే టెక్నికల్ సమస్యలు ఏర్పడటంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన  ఈ విమానం తక్కువ రేంజ్ ప్రయాణాలకు వినియోగించే రెండు ఇంజన్లది.
ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రయాణికులు బయటపడినట్లు తెలుస్తోంది.