
బషీర్ బాగ్, వెలుగు : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారి మత్తు వదిలిస్తున్నారు. ఈ నెల 1 నుంచి10 వరకు వేర్వేరు చోట్ల డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించగా, 1,614 మంది పట్టుబడ్డారు. గతంలో మద్యం తాగి బండి నడుపుతూ పట్టుబడిన 992 మందిపై చార్జ్ షీట్లు నమోదు చేశారు.
వీరిలోని 55 మందికి ఒకరు రోజు నుంచి 15 రోజుల జైలు శిక్ష పడింది. 8 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను నెల నుంచి6 నెలల వరకు సస్పెండ్ చేశారు. పట్టుబడిన వారి నుంచి ఫైన్ రూపంలో రూ.21లక్షల36 వేలు వసూలు చేశారు.