సైన్స్ అండ్  టెక్నాలజీకి రూ.16,361 కోట్లు

సైన్స్ అండ్  టెక్నాలజీకి రూ.16,361 కోట్లు
  • నిరుడి కన్నా రూ.2 వేల కోట్లు ఎక్కువ

న్యూఢిల్లీ: సైన్స్ అండ్  టెక్నాలజీకి కేంద్రం బూస్ట్  ఇచ్చింది. తాజా బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ16,361 కోట్లు కేటాయించారు. నిరుడి కేటాయింపుల (రూ.14,217.46) కన్నా ఈసారి రూ.2,143.54 కోట్లు ఎక్కువగా కేటాయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త సెంటర్  ఆఫ్  ఎక్స్ లెన్స్ల ఏర్పాటు వంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టనున్న నేపథ్యంలో ఈసారి ఎక్కువ కేటాయింపులు చేశారు. ఈ కేటాయింపులను డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్ మెంట్ ఆఫ్​ బయోటెక్నాలజీ, డిపార్ట్ మెంట్  ఆఫ్​ సైంటిఫిక్  అండ్  ఇండస్ట్రియల్ రిసర్చ్ అని మూడు భాగాలుగా విభజించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.7,931.05 కోట్లు, డిపార్ట్ మెంట్ ఆఫ్  బయోటెక్నాలజీకి రూ.2,683.86 కోట్లు, డిపార్ట్ మెంట్ ఆఫ్​ ఇండస్ట్రియల్ రిసర్చ్ కు రూ.5,746.51 కోట్లు కేటాయించారు. 

డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ కు తగ్గిన కేటాయింపులు

సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు రూ.2 వేల కోట్లు ఎక్కువగా కేటాయించిన నిర్మలమ్మ.. డిపార్ట్ మెంట్ ఆఫ్​ స్పేస్ కు ఈసారి రూ.12,543.91 కోట్లు కేటాయించారు. నిరుడి (రూ.13,700) కన్నా ఈ కేటాయింపులు రూ.1156 కోట్లు తక్కువ. ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్ నాథ్  ఆధ్వర్యంలో త్వరలో చంద్రయాన్ 3, సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రాజెక్టులను చేపడతామని డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్  తెలిపింది.