
- రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రాసేందుకు అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. టెట్ రాసేందుకు ఇప్పటి వరకు కేవలం 1,66,475 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల10తో ముగియనున్నది.
అయితే, ఈసారి టెట్ దరఖాస్తు ఫీజు భారీగా రూ.వెయ్యికి పెంచడంతో అభ్యర్థులు రాసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నాటికి పేపర్ 1కు 63,524 మంది, పేపర్2కు 1,02,951 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో రెండ్రోజులు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంది. దీంతో రెండు లక్షల లోపే అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.