భారత విద్యార్థులకు అమెరికా స్పేస్ క్యాంప్‌లో భాగంగా ఆస్ట్రొనాట్ శిక్షణ పొందే అవకాశం లభించింది. వరల్డ్ వైడ్ గా 41 దేశాలకు చెందిన 292 మంది ఈ అవకాశం దక్కించుకోగా… ఇండియా నుంచి హనీవెల్ లీడర్‌షిప్ చాలెంజ్‌లో నిలిచిన 17 మందికి ఇందులో అవకాశం దక్కింది. అలబామాలోని హంట్స్‌విల్లేలో యూఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్ లో రెండు వారాల పాటు వీరికి శిక్షణ ఉంటుంది. దీంతో పాటు కోడింగ్, కంప్యూటర్ సైస్సెస్, ఆస్ట్రోనాట్ రంగం గురించి వీరికి మరింత అవగాహన కల్పిస్తోంది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన తిరుమలశెట్టి రోహిత్ ఉన్నారు.
