రైతులకు 17 కొత్త విత్తనాలు అంకితం

రైతులకు 17 కొత్త విత్తనాలు అంకితం

పోషకాహార భద్రతా పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకోసం వివిధ రకాల పంటల కొత్త విత్తనాలను రైతులకు అంకితం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా… ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇవాళ వ్యవసాయ రంగానికి చారిత్రాత్మక రోజని…ప్రధాని ,నరేంద్ర తోమర్ 8 పంటల 17 కొత్త విత్తనాలను రైతులకు అంకితం చేశారని ట్వీట్ చేశారు. ఈ పంటలు ప్రజలకు పోషణను అందించడంతో పాటు… దేశం ‘హరిత విప్లవం’ నుంచి ‘సతత హరిత విప్లవం’ వరకు మారుతుందన్నారు అమిత్ షా.

వ్యవసాయ రంగాన్ని స్వావలంబనతో పాటు దేశానికి పోషక భద్రత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అమిత్ షా. ఈ కొత్త పంటల యొక్క పోషక విలువ మూడు రెట్లు అధికంగా ఉంటుంది, ఇది ప్రోటీన్, కాల్షియం, ఇనుము వంటి ముఖ్యమైన పోషక అంశాలను జోడించడం ద్వారా సాధారణ ఆహార పదార్థాన్ని పోషకమైనదిగా చేస్తుందంటూ తన ట్వీట్లలో తెలిపారు. మోడీ దార్శనిక నిర్ణయాలు నిరుపేదలకు సరైన పోషకాహారాన్ని అందించడమే కాక, మన రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతాయన్నారు.