చేవెళ్ల, వెలుగు: ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడి 17 మందికి విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ లోని హైదరాబాద్స్కూల్ఆఫ్ఎక్సలెన్స్ కు చెందిన 25 మంది విద్యార్థులు ఒక టీచర్, ఆయాతో కలిసి యాన్యువల్ డే ప్రోగ్రామ్ రిహార్సల్స్కోసం బుధవారం స్కూల్‌బస్సులో మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చాందిని గార్డెన్‌కు వచ్చారు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా మృగవని పార్క్‌వద్ద బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 17 విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో గాయపడిన వారిని పోలీసులు సమీప హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనలో విద్యార్థులెవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని, ఇప్పటికే 14 మందిని డిశ్చార్జి చేసినట్లు డీఈవో సుశీందర్ రావు తెలిపారు. డ్రైవర్నిర్లక్ష్యమే ప్రమాధానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు రాగా, టైర్‌పంక్చర్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు డీఈవో ప్రెస్‌నోట్‌లో పేర్కొనడం గమనార్హం.
