T20 World Cup 2026: మూడు జట్లే మిగిలున్నాయ్: టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే, నమీబియా

T20 World Cup 2026: మూడు జట్లే మిగిలున్నాయ్: టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే, నమీబియా

2026లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 టీ20 వరల్డ్‌ కప్‌కు జింబాబ్వే, నమీబియా జట్లు అర్హత సాధించాయి. ఆఫ్రికా క్వాలిఫయర్ సెమీ-ఫైనల్‌లో కెన్యాపై జింబాబ్వే ఘన విజయం సాధించగా.. మరో సెమీస్ లో టాంజానియాను నమీబియా ఓడించి ఈ మెగా ఈవెంట్ కు క్వాలిఫై అయింది. దీంతో 2026 వరల్డ్ కప్ కు 20 జట్లలో ఇప్పటివరకు 15 జట్లు అర్హత సాధించాయి. అక్టోబర్ 8 నుండి 17 వరకు ఒమన్‌లో జరగనున్న తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్‌ ముగిసిన తర్వాత మిగిలిన మూడు జట్లు ఖరారు చేయబడతాయి. 

తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే తొమ్మిది జట్లు.. ఒమన్, సమోవా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, నేపాల్, కువైట్, మలేషియా, జపాన్, పాపువా న్యూ గినియా. ఈ జట్లను మూడు గ్రూపులుగా విభజించారు. వాటిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ రౌండ్ ముగిసిన తర్వాత మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు టీ 20 వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి. మొత్తం 21 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 8న ఒమన్, సమోవా మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది. 

గ్రూప్ 1 - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా

గ్రూప్ 2 - నేపాల్, కువైట్, జపాన్

గ్రూప్ 3 - ఒమన్, సమోవా, పాపువా న్యూ గినియా

ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. 2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కు అర్హత సాధించిన దేశాలు 2026 వరల్డ్ కప్ కు తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఈ లిస్టులో ఉన్నాయి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ సూపర్ 8 కు అర్హత సాధించకపోయినా  ర్యాంకింగ్స్ పరంగా అర్హత సాధించాయి. దీంతో 20 జట్లలో క్వాలిఫై మ్యాచ్ లు ఆడకుండానే ఈ 12 టీమ్స్ 2026 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా కెనడా కూడా అర్హత సాధించి 13 వ జట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఇటలీ, నెదర్లాండ్స్ క్వాలిఫై అయ్యాయి. తాజాగా జింబాబ్వే, నమీబియా అర్హత సాధించడంతో ఇప్పటివరకు 17 జట్లు పొట్టి సమరానికి అర్హత సాధించాయి. 

2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పొట్టి సమరాన్ని రెండేళ్ల కొకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడడం తప్పితే ప్రతి రెండు సంవత్సరాలకు ఐసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తూ వస్తుంది. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024లో టీ20 వరల్డ్ కప్ జరిగింది. గత ఏడాది జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ముగిసిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.