దేశంలో 17 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో 17 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నమోదయిన కేసుల సంఖ్య 17 వేలు దాటింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 17,296 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరింది. అదేవిధంగా కరోనా బారినపడి నిన్న ఒక్కరోజే 407 మంది చనిపోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 15,301కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,89,463 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. కరోనా బారినపడి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,85,637కు చేరింది.

దేశవ్యాప్తంగా చూసుకుంటే మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దాంతో మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతుంది. అక్కడ మొత్తంగా 1,47,741 కేసులు నమోదయ్యాయి. వాటిలో 6,931 మంది చనిపోగా.. 77,453 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 63,357 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. అక్కడ కరోనా కేసుల సంఖ్య 73,780కి చేరింది. ఢిల్లీలో ఇప్పటివరకు 2,429 మంది కరోనా వల్ల చనిపోయారు. అక్కడ ప్రస్తుతం 26,586 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఢిల్లీలో కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 44,765గా ఉంది. ఆ తర్వాత 70,977 కేసులతో తమిళనాడు మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం అక్కడ 30,067 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 39,999గా ఉంది. ఇప్పటివరకు తమిళనాడులో 911 మంది కరోనా వల్ల చనిపోయారు.

For More News..

అత్యున్నత న్యాయస్థానానికి జడ్జీగా ఇండియన్ ను ప్రతిపాదించిన ట్రంప్

కామారెడ్డిలో జంట హత్యలు

ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్