175 క్వింటాళ్ల ధాన్యం దగ్ధం

175 క్వింటాళ్ల ధాన్యం దగ్ధం

నర్సం పేట, వెలుగు: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 175 క్వింటాళ్ల వరి ధాన్యం దగ్ధమైంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ముచ్చింపుల తండాకు చెందిన గుగులోతు సమ్మయ్య నాయక్ ఐదెకరాల్లో వరి పంట వేశాడు. 20 రోజుల క్రితం వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. టోకెన్, గన్నీ సంచుల కోసం ఇన్నాళ్లు తిరగగా బుధవారం ఉదయం సెంటర్ నిర్వాహకులు బస్తాలు ఇచ్చారు. 350 బస్తాల్లో ధాన్యం నింపుకోగా సమీప పొలాల్లో నుంచి నిప్పురవ్వలు బస్తాలపై పడటంతో 175 క్వింటాళ్ల ధాన్యం కాలిపోయింది. కాంటాలు కాకముందే పంట కాలిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని
రైతు విలపిస్తూ వేడుకున్నాడు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు