- మెదక్ జిల్లా కొల్చారంలో ప్రమాదం
కొల్చారం, వెలుగు : మందపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో 18 గొర్లు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్లే ఆర్టీసీ బస్సు సోమవారం కొల్చారం మండలం కేంద్రంలో మందపైకి దూసుకెళ్లడంతో 18 గొర్లు మృతిచెందాయి. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్టు నారాయణపేట జిల్లాకు చెందిన బాధితుడు నర్సింలు వాపోయాడు. రోడ్డుపై గొర్లు చెల్లా చెదురుగా పడ్డాయి. సమాచారం తెలియడంతో కొల్చారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు చేపట్టారు.
