కేజీబీవీ మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్స్

కేజీబీవీ మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్స్

హైదరాబాద్, వెలుగు: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే మహిళా ఎంప్లాయీస్​కు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్స్​కు సర్కారు అంగీకరించింది. 180 రోజుల ఆన్​డ్యూటీ కల్పిస్తూ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు జీవో రిలీజ్ చేశారు. ఇద్దరు పిల్లల వరకే ఇది వర్తిస్తుందని ప్రకటించారు. కేజీబీవీ టీచర్ల పోరాటంతో సీఎం కేసీఆర్.. మెటర్నిటీ లీవ్స్ ఇస్తామని అసెంబ్లీలో​హామీ ఇచ్చారు. కేజీబీవీ మహిళా సిబ్బందికి మెటర్నిటీ లీవ్స్ ఉత్తర్వులు ఇవ్వడంపై యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, పర్వత్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.