ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 181 నామినేషన్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు  సర్పంచ్ స్థానాలకు 181 నామినేషన్లు
  • వార్డుమెంబర్​ స్థానాలకు 136 నామినేషన్లు దాఖలు 

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్​ స్థానాలకు తొలి రోజు గురువారం186 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుమెంబర్​ స్థానాలకు 136 నామినేషన్లు దాఖలయ్యాయి.  ఖమ్మం జిల్లాలో మొదటి విడతలో కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో మొత్తం 192 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. 

వాటిలో సర్పంచ్ కోసం 99 నామినేషన్లు రాగా, మొత్తం 1,740 వార్డులకు ఎలక్షన్లు జరుగుతుండగా 49 నామినేషన్లు దాఖలయ్యాయి.  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోచర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, పినపాక, మణగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్​, భద్రాచలం మండలాల్లోని 159 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో  తొలిరోజు సర్పంచ్​ స్థానాలకు  82 నామినేషన్లు, 1,436 వార్డులకు సంబంధించి మొత్తం 87 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.