దవాఖాన్లలో 1,823 స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత

దవాఖాన్లలో 1,823 స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత
  • పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలలో పనిచేస్తున్న పెద్ద డాక్టర్లు
  • రూల్స్​లో మార్పులు చేస్తే కొన్ని ఖాళీల భర్తీకి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఇటీవల చేపట్టిన భారీ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సర్కారు దవాఖాన్లలో నర్సులు కొరత తీరినా.. డాక్టర్ల కొరత అలాగే కొనసాగుతోంది.  ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో కలిపి సుమారు 3,250 డాక్టర్  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు అందుబాటులోనే వనరులున్నా ఆ దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు. నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న స్పెషలిస్టులను కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారు 1,420 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ సర్కార్ 1,442 పోస్టులకు నోటిఫికేషన్​ ఇస్తే, అందులో సగం పోస్టులు కూడా భర్తీ కాలేదు. ప్రభుత్వ దవాఖాన్లతో పోలిస్తే  ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీతాలు ఎక్కువగా ఉండడం, ప్రైవేటు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిషేధం వంటి కారణాలతో స్పెషలిస్టులు ఆసక్తి చూపడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. పాత పోస్టులు, కొత్త కాలేజీలకు సాంక్షన్ అయిన పోస్టులు కలిపి ఖాళీల సంఖ్య మళ్లీ 1,400 దాటింది. వీటిని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ర్కారు ప్రయత్నిస్తోంది. కాంట్రాక్ట్  పద్ధతిలో నోటిఫికేషన్లు ఇస్తున్నా డాక్టర్లు రావడం లేదు. అలాగే, వైద్య విధాన పరిషత్  పరిధిలో ఉండే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్  సెంటర్లలో సుమారు 1,823 స్పెషలిస్ట్  డాక్టర్  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అందుబాటులోనే ఉన్నా

సర్కారు దవాఖాన్లలో పనిచేస్తున్న ఎంబీబీఎస్  డాక్టర్లకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటాలో పీజీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. పీజీ సీటుతో పాటు మూడేండ్ల పాటు లీవ్ ఇచ్చి సాలరీలు కూడా  చెల్లిస్తున్నారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీజీ చేసిన డాక్టర్లు.. పీజీ అయిపోయాక ఐదేండ్ల పాటు ప్రభుత్వ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగాల్సి ఉంటుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటాలో సుమారు 2 వేల మంది డాక్టర్లు పీజీ చేశారు. పీజీ అయ్యాక వారిని మెడికల్  కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే ఏరియా, జిల్లా హాస్పిటళ్లలో స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్లుగా తీసుకుని పనిచేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను అబ్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పిలుస్తారు. ఏడాదికోసారి లేదా రెండేండ్లకోసారి అబ్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటిఫికేషన్ ఇస్తున్నారు.  కానీ, ఈ పదేండ్లలో 800 మంది డాక్టర్లు కూడా అబ్సార్బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వలేదు. వారంతా అబ్సార్బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వకుండా డైరెక్టర్  ఆఫ్ హెల్త్ పరిధిలోని పీహెచ్​సీల్లో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. వాస్తవానికి పీజీ చేసిన డాక్టర్ల సేవలు పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలకు అవసరం ఉండదు. ఉదాహరణకు ఓ రేడియాలజిస్ట్  పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో పనిచేయడం పూర్తిగా నిరుపయోగం. పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో కనీసం ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే మెషీన్  కూడా ఉండదు.  అలాంటి చోట రేడియాలజిస్ట్  పనిచేయడంలో అర్థం లేదు. ఇలా చాలా మంది స్పెషలిస్టులు పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలలో కొనసాగుతూ, ప్రైవేటు హాస్పిటళ్లలో ఉద్యోగాలు చేస్తున్నారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలకు డాక్టర్లు వస్తున్నారో లేదో మానిటర్ చేయకపోవడం వారికి కలిసి వస్తోంది. వాస్తవానికి వారినీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అబ్బార్బ్  చేసుకుంటే, ఇప్పటికి ఇప్పుడు చాలా వరకూ ఖాళీల సంఖ్యను తగ్గించొచ్చు. అదే సమయంలో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలలో పనిచేసేందుకు ఎంబీబీఎస్  అర్హత కలిగిన డాక్టర్లను రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేసుకోవచ్చు. ఎంబీబీఎస్  అర్హత ఉండి ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేసేందుకు వేల మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. నిరుడు ఎంబీబీఎస్  డాక్టర్ల రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటిఫికేషన్ ఇస్తే, సుమారు 5 వేల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

అడ్డొస్తున్న రూల్

అబ్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలో ఉన్న చిన్న లొసుగును అడ్డం పెట్టుకుని స్పెషలిస్టులు పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలలో కొనసాగుతున్నారు. తమకు నచ్చిన చోట పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటేనే అబ్బార్బ్ అవుతున్నారు. లేకుంటే తమకు ఇష్టం లేదంటూ పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలలోనే కొనసాగుతు న్నారు. కంపల్సరీగా అబ్బార్బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అవ్వాల్సిందేనని రూల్స్​లో మార్పులు చేస్తే, ప్రస్తుతం డైరెక్టర్  ఆఫ్ హెల్త్ పరిధిలో ఉన్న స్పెషలిస్టు లందరినీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, వీవీపీ పరిధిలోనే జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమ్యూనిటీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సెంటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పెషలిస్టుగా వారి సేవలను వినియోగించుకోవచ్చు. దీంతో కొన్ని ఖాళీలను భర్తీ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.