న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ఈ ఏడాది ఆగస్టులో నికరంగా 18.53 లక్షల మంది మెంబర్లను జాయిన్ చేసుకుంది. కిందటేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9.07 శాతం ఎక్కువ. వీరిలో మొదటిసారిగా పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేసిన వారు 9.30 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, ఈపీఎఫ్‌ఓ బెనిఫిట్స్‌పై అవగాహన పెరగడంతో ఈ సంస్థ మెంబర్లు పెరుగుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ డేటా ప్రకారం, ఈ ఏడాది ఆగస్టులో చేరిన ఈపీఎఫ్‌ఓ మెంబర్లలో 18–25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 59.26 శాతం మంది ఉన్నారు. వీరి సంఖ్య 8.06 లక్షలుగా రికార్డయ్యింది. ఈపీఎఫ్‌ఓని వీడిన 13.54 లక్షల మంది ఈ ఏడాది ఆగస్టులో మళ్లీ రీజాయిన్ అయ్యారు. వీరు కొత్త జాబ్‌లో జాయిన్ కావడమో లేదా ఫైనల్ సెటిల్‌మెంట్ కాకుండా తమ పీఎఫ్ డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమో చేశారు. ఈ ఏడాది ఆగస్టులో చేరిన కొత్త మెంబర్లలో సుమారు 2.53 లక్షల మంది మహిళలు ఉన్నారు.