
- మెదక్ జిల్లాలో కొత్తగా18,802 కార్డులు
మెదక్ టౌన్, వెలుగు: కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు సోమవారం నుంచి సన్న బియ్యం పంపిణీ కి సివిల్ సప్లై డిపార్టుమెంట్అధికారులు ఏర్పాట్లు చేశారు. జూన్ నెలలలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సెప్టెంబర్ నెలకు సంబంధించి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదివరకు ఉన్న కార్డుదారులతో పాటు కొత్త రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు.
మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 520 రేషన్ దుకాణాలు ఉండగా, 2,32,579 మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లాలో కొత్తగా 18,802 రేషన్ కార్డులు మంజూరు చేయగా 80,066 మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందించనున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి 4,850 మెట్రిక్ టన్నుల బియ్యం అలాట్ అయ్యాయి.