ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర

ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర

అమర్‌నాథ్‌ పవిత్ర గుహను దర్శించుకునేందుకు యాత్ర ఈరోజు ఉదయం 5.30గంటల ప్రాంతంలో అనంత్‌నాగ్‌ జిల్లా అభివృద్ధి విభాగం కమిషనర్‌ ఖలీద్ జహంగీర్‌ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. కాగా నిన్న(ఆదివారం) జమ్ము బేస్ క్యాంపు నుంచి బల్తాల్‌ బేస్‌ క్యాంప్‌నకు బయలుదేరిన యాత్రికుల బృందం  ఇవాళ యాత్రను ప్రారంభించారు.  మొదటి బ్యాచ్ లో 2,234మంది భక్తులు ఉన్నారు. అయితే 46 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి 1.5లక్షలకు పైగా భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. యాత్రకు దాదాపు 30వేల మందికి పైగా పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది.