అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలం గాణ విద్యార్థిని మృతిచెందింది. సోమవారం (ఆగస్టు 11) చికాగో లో చదువుకుంటున్న మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని గండిమైసమ్మకు చెందిన శ్రీనురావు కుమార్తె శ్రీజ వర్మ (23) రెస్టారెంట్ కు నడుచుకుంటూ వెళ్తుండగా వెనకు ట్రక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో దుండిగల్ లోని  ఆమె నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

చికాగోలో ఎంఎస్ చదువుతున్న శ్రీజవర్మ ఓ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న శ్రీజ రాత్రి భోజనానికి పక్కనే ఉన్న రెస్టారెంట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనకనుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఆమె ఢీకొట్టడంతో శ్రీజ మృతిచెందింది. వీడియో కాల్ ద్వారా ఆమె మృతికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులకు చికాగో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటన తెలంగాణ NRI కుటుంబాల్లో తీవ్ర దిగ్భ్రాంతి, బాధను కలిగించింది. 

►ALSO READ | భారీ వర్షాలు..అవసరమైతే తప్ప బయటకు రావొద్దు