అవాక్కయ్యారా : 323 SFTలో 2 BHK.. అది కూడా రూ.75 లక్షలు..!

అవాక్కయ్యారా : 323 SFTలో 2 BHK.. అది కూడా రూ.75 లక్షలు..!

ఇళ్ల ధరలు ముంబైలో ఎలా ఉన్నాయి అనటానికి ఇదే ఎగ్జాంపుల్.. భారీ టవర్స్ లో అపార్ట్ మెంట్ అంటే కోట్ల రూపాయలు పెట్టాల్సింది. అన్ని కోట్లు లేనోళ్లు.. అదే టవర్ లో ఉండాలంటే.. అది కూడా డబుల్ బెడ్ రూం ప్లాట్ అయితే.. ధర 75 లక్షల రూపాయలు మాత్రమే అయితే.. ఊహించటానికే ఆశ్చర్యంగా ఉన్నా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసి నెటిజన్లు అందరూ అవాక్కవుతున్నారు.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ప్లాట్ కథ ఏంటో చూద్దాం...

ముంబైలోని కండివాలి ఏరియా. చాలా కాస్ట్లీ. ఈ ప్రాంతంలో 23 అంతస్తుల టవర్స్ నిర్మాణం జరుగుతున్నాయి. ఈ టవర్ లో జస్ట్.. కేవలం 323 SFT ఏరియాలో.. 2BHK ప్లాట్ నిర్మించారు. అస్సలు ఊహించని విధంగా అద్భుతంగా దిద్దారు ఈ ప్లాట్ ను. 323 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్ రూం ఎలా వచ్చింది అనేది చూస్తే.. లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, కిచెన్ మొత్తం పొడవుగా ఉంటుంది. లివింగ్ ఏరియాలోనే ఓ వైపు టీవీ స్లాట్ ఇచ్చారు. డైనింగ్ కోసం క్లోజింగ్ టేబుల్ ఉంది. ఆ పక్కనే కిచెన్ ఏరియా ఇచ్చారు. 

ఇక రెండు బెడ్ రూంలను అటాచ్ డ్ టాయిలెట్స్ ఇచ్చారు. అన్నీ గోడలకు ఫిట్ చేశారు. వాస్తవంగా సింగిల్ బెడ్ రూంకు  కూడా ఇరుకుగా ఉండే ఈ స్పేస్ లో.. డబుల్ బెడ్ రూం నిర్మాణం అనేది ముచ్చటగా ఉన్నా.. పిల్లలు ఉంటే మాత్రం కష్టం. గెస్ట్ లు వస్తే ఇంకా కష్టం. జస్ట్ సింగిల్స్ కు అయితే చాలా బెటర్. పిల్లలు లేని ఫ్యామిలీకి సూట్ అవుతుంది. ఎక్కువ వస్తువులు ఉన్నా పెట్టుకోవటానికి స్థలం ఉండదు. విత్ ఫర్నిచర్ తో సహా.. 323 SFTలో ఇస్తున్న ఈ డబుల్ బెడ్ రూం ప్లాట్ ధర 75 లక్షల రూపాయలు. 

ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ ప్రమోషన్ కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో.. ఇప్పుడు వైరల్ అయ్యింది. ఎలా సాధ్యం అంటూ అందరూ ఆశ్చర్యంగా చూడటమే కాదు.. ప్లాట్ చూసిన తర్వాత అవాక్కవుతున్నారు. ఆ వీడియో మీరూ చేసేయండి..