లారీ కింద‌కు దూసుకెళ్లిన‌ బైక్.. దంపతులు మృతి

లారీ కింద‌కు దూసుకెళ్లిన‌ బైక్.. దంపతులు మృతి

రంగారెడ్డి జిల్లా: నందిగామ మండ‌లంలోని నేష‌న‌ల్ హైవేపై శ‌నివారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కొత్తూరు నుండి షాద్ నగర్ వైపు వస్తుండ‌గా రోడ్డుపై బైక్ స్కిట్ అయ్యి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ కిందకు వెళ్లడంతో .. బైక్ పై ఉన్న‌ దంపతులు ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వీరు షాద్ నగర్, ఫరూక్ నగర్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు స్థానికులు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.