యుద్ధంలో 2 లక్షల మంది సైనికులు చనిపోయారు

యుద్ధంలో 2 లక్షల మంది సైనికులు చనిపోయారు

రష్యా-ఉక్రెయిన్​ వార్​పై యూఎస్ టాప్ జనరల్ మార్క్ మిల్లీ

వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్​ వార్​లో ఇప్పటిదాకా 2లక్షల మంది సైనికులు చనిపోయారని, వేలాది మంది గాయపడ్డారని యూఎస్ టాప్ జనరల్ మార్క్ మిల్లీ గురువారం తెలిపారు. 8 నెలల నుంచి వార్​ కొనసాగుతోందన్నారు. 2 దేశాల్లో లక్ష మంది సైనికుల చొప్పున చనిపోయారని చెప్పారు. న్యూయార్క్​ ఎకనామిక్​ క్లబ్​ ప్రోగ్రాంలో మార్క్​ మిల్లీ మాట్లాడారు. ఈ వార్‌‌‌‌లో 40 వేల మంది పౌరులు కూడా చనిపోయారని అంచానా వేశారు.  యుద్ధానికి ఫుల్​స్టాప్​ పెట్టే ఆలోచనలో ఉక్రెయిన్​ ఉన్నట్టు తెలుస్తున్నదన్నారు. ఈ విషయంలో రష్యాతో చర్చలు జరిపేందుకు కీవ్​ ఆసక్తి చూపుతోందని మార్క్ మిల్లీ తెలిపారు. 

చలికాలంలో యుద్ధం చేయలేరు..

రెండు దేశాలు చర్చలపై  ఆస‌‌‌‌క్తి చూపుతున్నట్టు మిల్లీ   వెల్లడించారు. ప్రాణ న‌‌‌‌ష్టం ఎక్కువ‌‌‌‌గా ఉండటం, రాబోయే చలికాలం మంచు కురుస్తూ ఉండటంతో యుద్ధం కష్టంగా మారుతుందన్నారు. చర్చలతోనే వార్​ ముగుస్తుందని తేల్చి చెప్పారు. సైనికుల ద్వారా ఏ దేశం విజయం సాధించబోదని అన్నారు.  దక్షిణ ఉక్రెయిన్​లోని ఖెర్సన్​ సిటీ నుంచి రష్యా తన బలగాలను ఉప సంహరించుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మార్క్​ మిల్లీ ఈ కామెంట్లు చేశారు. రష్యా నిర్ణయాన్ని ఉక్రెయిన్​ తప్పుబట్టింది. వార్​ స్ర్టాటజీలో భాగంగానే రష్యా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుందని విమర్శించింది.