V6 News

మ్యూజిక్ ఈవెంట్‌లో డ్రగ్స్ కలకలం.. ఓవర్‌డోస్ తో ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్ మృతి

మ్యూజిక్ ఈవెంట్‌లో డ్రగ్స్ కలకలం.. ఓవర్‌డోస్ తో ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్ మృతి

డ్రగ్స్ వాడకం..సరదాగా మొదలవుతుంది.. వ్యసనంగా మారుతుంది.. యువతలో ఇప్పుడు ఇది ఒక మహమ్మారిలా విస్తరిస్తోంది. సరదా కోసం మొదలయ్యే ఈ అలవాటు, ప్రాణాంతకమైన వ్యసనంగా మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.చివరికి ప్రాణాలు తీస్తుంది. ముంబైలో ఓ మ్యూజిక్ ఈవెంట్ ఎంతో భవిష్యత్ ఉన్న ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసిన ఘటన ఇప్పుడు విద్యార్థి లోకాన్ని కలవర పెడుతోంది. 

ఏప్రిల్ 11న ముంబైలో గోరేగావ్ లోని నెస్కో సెంటర్ లో డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకొని ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ చనిపోవడం కలకలం రేపింది. మరో విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ ఈవెంట్ కు దాదాపు 4వేల మంది హాజరు కాగా వారి చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. విద్యార్థుల్లో చాలా మంది MDMA డ్రగ్స్ ను తీసుకున్నట్లు తెలిపారు. 

ఈవెంట్ జరుగుతున్న సమయంలో రాత్రి 12 గంటల మధ్య ముగ్గురు విద్యార్థులు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడటంలో వారిని ఆస్పత్రికి తరలించారు. వారితో  ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ చనిపోగా..  ఓ యువతి పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మరణించిన విద్యార్థులు ఈవెంట్ కు చేరక ముందే  ఓ  MDMA పిల్ తీసుకోగా.. ఈవెంట్ లో మరో పిల్ తీసుకోవడంతో ఓవర్ డోస్ కారణంగా   చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

ఇక విద్యార్థులకు డ్రగ్స్ చేసింది కూడా ఓ విద్యార్థి అని పోలీసులు గుర్తించారు. విద్యార్థితోపాటు  ఈవెంట్ నిర్వాహకుడు,  నెస్కో సెంటర్ ఆర్గనైజర్ ను అరెస్ట్ చేశారు.