గ్రేటర్ లో 2 నెలల్లో.. 21.21 లక్షల ట్రాఫిక్ వయొలేషన్ కేసులు

గ్రేటర్ లో 2 నెలల్లో.. 21.21 లక్షల ట్రాఫిక్ వయొలేషన్ కేసులు

రూల్స్ బ్రేక్ చేసిన వారికి చలాన్లు
హైదరాబాద్,వెలుగు: లాక్​డౌన్ పీరియడ్​లో గ్రేటర్​లో మొత్తం 21 లక్షల21 వేల 200 ట్రాఫిక్ వయొలేషన్ కేసులు నమోదయ్యాయి. 60 రోజుల్లో హెల్మెట్​కి సంబంధించిన కేసులే 10 లక్షల 90 వేల 396 ఉన్నాయి. వాటిల్లో హెల్మెట్ లేని కేసులు, పిలియన్ రైడర్​కి హెల్మెట్ పెట్టుకోనివి, క్వాలిటీ లేని హెల్మెట్ వాడని, హెల్మెట్​కు బెల్ట్ లేని కేసులూ రిజిస్టర్ అయ్యాయి. మరోవైపు పెండింగ్‌ చలాన్లు ఉన్న వెహికల్స్ సీజ్‌ చేస్తున్నారు.

సైబరాబాద్​లో సైడ్ మిర్రర్ కేసులు

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సైడ్‌మిర్రర్స్‌ లేని బైక్‌లపై 1,06,120 కేసులు నమోదయ్యాయి. హెల్మెట్ క్వాలిటీ లేకున్నా.. దానికి ఉండే మిర్రర్ సగమే ఉన్నా.. హాఫ్ హెల్మెట్ వాడినా పోలీసులు ఫైన్ వేశారు. ఇప్పటి వరకు 18 మందిపై లెర్నర్స్‌ పై కేసులు నమోదు చేసి ఆర్టీఏ అథార్టీకి సిఫార్స్‌ లెటర్స్‌ పంపించారు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు