
లూమియో ఆర్క్ 5 (ధర రూ.19,999), ఆర్క్ 7 (రూ.34,999) స్మార్ట్ ప్రొజెక్టర్లను ఇండియాలో లాంచ్ చేసింది. గూగుల్ టీవీ, నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్‌తో 10 వేలకు పైగా యాప్‌లు, 4 లక్షలకు పైగా షోలు అందుబాటులో ఉన్నాయి.
ఆర్క్ 5 (200 ఏఎన్‌ఎస్‌ఐ ల్యూమెన్స్, బరువు 1.33 కేజీ), ఆర్క్ 7 (400 ఏఎన్‌ఎస్‌ఐ ల్యూమెన్స్, రెండు 8వాట్స్ స్పీకర్స్) 100-అంగుళాల ప్రొజెక్షన్, హెచ్‌డీర్ 10, డాల్బీ ఆడియో అందిస్తాయి.
ఆటో -కీస్టోన్, ఆటోఫోకస్ ఫీచర్లు ఉన్నాయి. జులై 12 నుంచి ఆర్క్ 7, జులై చివరిలో ఆర్క్ 5 అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి.