అమెరికాలో అంత్యక్రియలు జరగాలంటే.. 2వారాలు వెయిట్ చేయాల్సిందే

అమెరికాలో అంత్యక్రియలు జరగాలంటే.. 2వారాలు వెయిట్ చేయాల్సిందే

మళ్లీ పెరుగుతున్న మరణాలు

రెండ్రోజులుగా వెయ్యికి పైనే నమోదు

2 వారాల పాటు ఫ్రిజ్‌‌‌‌ల్లో నే..

వాషింగ్టన్‌‌‌‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల వరకు కాస్త తగ్గిన డెత్‌ రేటు ఈ మధ్య మళ్లీ ఎక్కువవుతూ వస్తోంది . దీంతో కొన్ని ప్రాంతాల్లో అంత్యక్రియలకు కూడా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది . శ్మశాన వాటికలో క్రిమేషన్‌‌‌‌ చేసేందుకు రెండు వారాల వరకు వెయిట్‌ చేయాల్సి వస్తోంది .

టెక్సస్‌‌‌‌లో దారుణంగా..

అమెరికా లో గత రెండ్రోజులుగా వెయ్యికి పైనే మరణాలు నమోదయ్యాయి. జులై 21న 1,165.. జులై 22న 1,205 మంది కరోనాతో చనిపోయారు. నెవెడా, టెక్సస్‌‌‌‌, అల్బా మాలో ఎక్కువ మంది మరణించారు. టెక్సస్‌‌‌‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కో ట్రక్కులో 50 మృతదేహాలను రెండు వారాల వరకూ ఉంచుతున్నారు. అమెరికాలో మరణాలు వెయ్యి దాటడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు 2 వేలు దాటిన రోజులూ ఉన్నాయి. ఏప్రిల్‌‌‌‌ మధ్య వారంలో 2,500కు పైగా మరణాలు రికార్డయ్యాయి.

41 లక్షలు దాటిన కేసులు

అమెరికా లో కరోనా కేసులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్‌‌‌‌లో వైరస్‌‌‌‌ విజృంభించినా జూన్‌‌‌‌ తొలి రెండు వారాల్లో కాస్త తగ్గింది . కానీ జులైలో వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రెండు వారాలుగా రోజూ 60 వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. జులై 17న అత్యధికంగా 74,987 కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం అక్కడ కేసులు 41 లక్షలు దాటాయి. మరణాలు లక్షా 46 వేలకు చేరుకున్నాయి. రికవరీలు ఇరవై లక్షలకు దగ్గర్లో ఉన్నాయి.

మాస్కులు పెట్టుకోండి: ట్రంప్

కేసులు పెరుగుతుం డటంతో ప్రజలను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌‌‌‌ హెచ్చరిం చారు. కట్టడి చర్యలు చేపడుతున్నా పరిస్ థితులు దిగజారడం ఆందోళన కలిగిస్తోందిన్ నారు. వైరస్‌‌‌‌ తీవ్రత తగ్గిపోయే ముందు మరిం త ఎక్కువవ్వొచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరిం చాలని విజ్ఞప్తి చేశారు. అందరూ ఊహించిన దానికన్నా ముం దే వ్యాక్సిన్‌‌‌‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.