ఉక్రెయిన్ నుంచి 20 లక్షల మంది వలస

ఉక్రెయిన్ నుంచి 20 లక్షల మంది వలస
  • ఇతర దేశాలకు 20 లక్షల మంది వలస
  • రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
  • యుద్ధభూమి నుంచి సేఫ్ కారిడార్లలో వెళ్తున్న ప్రజలు 
  • రష్యా బాంబు దాడితో సుమీలో 21  మంది మృతి

కీవ్/మాస్కో: గడ్డ కట్టే చలి.. ఇండ్లలో వేడి పుట్టించేందుకు కరెంటు లేదు. నీళ్లు లేవు.. బువ్వ లేదు.. రష్యా ముట్టడిలో చిక్కుకున్న ఉక్రెయిన్ నగరాల పరిస్థితి ఇది. దీంతో  రెండు దేశాల ఒప్పందంతో ఏర్పాటైన సేఫ్ కారిడార్ల నుంచి ప్రజలు తరలిపోతున్నరు. రష్యా ముట్టడిలో ఉన్న సిటీల్లోని ప్రజలను సేఫ్ కారిడార్ల నుంచి తరలించడం మంగళవారం మొదలైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోతున్నరు. ఇప్పటికే 20 లక్షల మందికి పైగా దాకా దేశం విడిచి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం దేశం ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు కారిడార్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పుకుంటున్న రష్యా.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాత్రం పాటించడంలేదు. షెల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తూనే ఉంది.

సుమీ, మరియుపోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బస్సుల్లో తరలింపు
పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కాల్పుల విరమణ పాటించేలా రష్యా, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య ఒప్పందం కుదిరింది. తమ బలగాలు ఉదయం 9 గంటల నుంచి కాల్పులు నిలిపివేశాయని రష్యా తెలిపింది. సుమీ నగరం నుంచి పౌరుల తరలింపు జరుగుతోంది. ప్రజలతో నిండిన బస్సులు మంగళవారం సుమీలోని రోడ్ల వెంట కనిపించాయి. కాల్పుల విరమణ పాటిస్తామని ముందుగా హామీ ఇచ్చి తర్వాత రష్యన్ దళాలు మాట తప్పుతుండటంతో.. తమపై ఎక్కడ షెల్లింగ్ చేస్తాయోనని జనం ఊపిరిబిగపట్టుకుని వెళ్లారు. సుమీ నుంచి 175 కిలోమీటర్ల దూరంలోని పోల్టావా నగరానికి వారిని పంపుతారు. ఇండియా, చైనా, ఇతర దేశాలకు చెందిన స్టూడెంట్లను సురక్షితంగా తరలించే ప్లాన్లు చేస్తున్నట్లు ఉప ప్రధాని ఇరీనా వెరెష్చుక్ చెప్పారు. 8 ట్రక్కులు, 30 బస్సులు మారియుపోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మానవతా సాయం అందించేందుకు, జపోరిషియాకు పౌరులను తరలించేందుకు వెళ్లాయని, నీళ్లు, ఆహార పదార్థాలు, మందులను పంపామని, అందులో పౌరులను తరలిస్తామని చెప్పారు. మరియుపోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేసిన కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రష్యన్ దళాలు షెల్లింగ్ జరిపాయని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓలెగ్ నికొలెంకో చెప్పారు. రష్యా తన హామీకి కట్టుబడి ఉండేలా ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. 

సుమీపై 500 కిలోల బాంబు
సుమీ నగరంలోని ఇండ్లపై రష్యా 500 కిలోల భారీ బాంబు వేసింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది పౌరులు చనిపోయారు. మొన్న చెర్నిహివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నివాసా ప్రాంతాలపై 500 కిలోల బాంబు వేశారు. అది పేలలేదు. బాంబుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

టాయిలెట్లలో పుతిన్ ఫొటో
లండన్: ఉక్రెయిన్​పై సైనిక దాడిని వ్యతిరేకిస్తున్న దేశాల్లో ప్రజలు రకరకాలుగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. రష్యా చర్యలను వ్యతిరేకిస్తూ లండన్​లో ఉన్న ఓ పబ్  టాయిలెట్​లో పుతిన్ ఫొటోను పెట్టారు. ఇన్​స్టాగ్రామ్ లో ఫొటో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. పుతిన్ ఫొటో మీద టాయిలెట్ చేస్తూ అక్కడివాళ్లు నిరసన తెలియజేస్తున్నారు. అయితే, అంతకుముందువరకు అక్కడ యూఎస్ మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఫొటో ఉండేదని తెలిపారు. ఇప్పటికే లండన్​లోని ఎన్నో సూపర్ మార్కెట్లు రష్యా ఉత్పత్తుల అమ్మకాలను బ్యాన్ చేశాయి. యూఎస్, కెనడా దేశాల్లోనూ చాలా సూపర్ మార్కెట్లలో రష్యన్ వోడ్కా అమ్మకాలను బ్యాన్ చేశారు.

ఉక్రెయిన్ ఆర్మీలోకి తమిళ యువకుడు
రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమి ళనాడుకు చెందిన 21 ఏండ్ల యువకుడు సాయినికేశ్ రవిచంద్రన్.. ఉక్రెయిన్ వెళ్లి అక్కడి సైన్యంలో చేరాడు. గతంలో అతడు రెండుసార్లు ఇండియన్ ఆర్మీలో చేరేందు కు దరఖాస్తు చేసుకోగా, ఎత్తు తక్కువ ఉండటంలో అప్లికేషన్ రిజెక్ట్ అయింది. దీంతో తనను అమెరికా సాయుధ దళాల్లో చేర్చుకోవాలని కోరుతూ.. ఇటీవల ఎంబసీ ని కూడా ఆశ్రయించాడు. కానీ అక్కడా చుక్కెదురైంది. రవిచంద్రన్ వివరాలు సేక రించేందుకు తుడియలూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అతడి ఇంటికి కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వెళ్లా రు. విచారణ సందర్భంగా అతడు ఉక్రెయిన్ ఆర్మీలో చేరినట్లు తెలిసింది. రవిచంద్రన్.. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఖార్కివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడని, ఇటీవల ఓ వీడియో గేమ్ డెవలపింగ్ కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. తన కొడుకు వెనక్కి తీసుకురావాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని వేడుకున్నారు.