ఆపరేషన్ లేకుండా మోకాలి నొప్పికి ట్రీట్​మెంట్: డాక్టర్ సుధీర్

ఆపరేషన్ లేకుండా మోకాలి నొప్పికి  ట్రీట్​మెంట్: డాక్టర్ సుధీర్

సికింద్రాబాద్, వెలుగు: ఎలాంటి ఆపరేషన్ లేకుండానే మోకాలి కీళ్ల నొప్పులకు వైద్యం అందిస్తున్నామని ఇపియోన్ పెయిన్ మేనేజ్​మెంట్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ సుధీర్ దారా, డాక్టర్ మీనల్ చంద్ర తెలిపారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ..  మోకాలి కీళ్ల నొప్పులతో బాధపడుతున్న 20 వేల మందికి తమ సెంటర్​లో ఎలాంటి ఆపరేషన్ ​లేకుండా మందుల ద్వారా నయం చేశామన్నారు. ట్రీట్​మెంట్ తీసుకున్న వారు తమ పనులను ఈజీగా, ఎలాంటి బాధ లేకుండా చేసుకుంటున్నారని వారు తెలిపారు. ఇపియోన్ పెయిన్​ క్లినిక్, రీజనరేటివ్ థెరపీ సెంటర్ ​అనేది దేశంలోనే మొట్టమొదటి మల్టీ డిసిప్లీనరీ పెయిన్​మేనేజ్​మెంట్ ​సెంటర్​అని వారు చెప్పారు. 

ప్రతి పేషెంట్​కు ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉపయోగించి ప్లాస్మా థెరపీ చేయడం తమ సెంటర్ ప్రత్యేకత అని వెల్లడించారు. లేటెస్ట్ మెషీన్లు, ఫెసిలిటీస్​తో పేషెంట్లకు క్వాలిటీ ట్రీట్​మెంట్ అందిస్తున్నామన్నారు.  అత్యంత త్వరితగతిన ఫలితాలను అందించడం కోసం సోనోసైట్​ పీ-ఎక్స్ మెషీన్​ను ఏర్పాటుచేసిన మొదటి కేంద్రం తమదేనన్నారు. మన దేశంలో ఇప్పటికే  చెన్నై, బెంగుళూరు నగరాల్లో ఇపియోన్​సెంటర్లను ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో మరో పది నగరాల్లో తమ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ చికిత్సను విస్తరించనున్నామని డాక్టర్ సుధీర్ దారా, మీనల్ చంద్ర తెలిపారు.