సిద్ధిపేట జిల్లాలో వర్ష బీభత్సం.. నీట మునిగిన శ్రీనగర్ కాలనీ...

సిద్ధిపేట జిల్లాలో వర్ష బీభత్సం.. నీట మునిగిన శ్రీనగర్ కాలనీ...

సిద్ధిపేట జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ క్రమంలో సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ నీట మునిగింది. కాలనీ రోడ్లపై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట మున్సిపల్ అధికారులు కాలనీలో నిలిచిన నీటిని తొలగించడానికి చర్యలు చేపట్టారు.

మరో పక్క భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సిద్దిపేటలోని కోమటి చెరువు నిండుకుండను తలపిస్తుంది. ఈ క్రమంలో కోమటి చెరువు మత్తడి పారుతోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో  మూడు రోజుల  ( ఆగస్టు 28 నుంచి) పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.   తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలం అయింది. 

Also Read : కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్

వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు వృత్తాకార పవన ద్రోణి కొనసాగుతుంది.