Hridayapoorvam X Review: 'హృదయపూర్వం' మూవీ రివ్యూ.. క్లాసిక్ డ్రామాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందా?

Hridayapoorvam X Review: 'హృదయపూర్వం' మూవీ రివ్యూ.. క్లాసిక్ డ్రామాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందా?

మలయాళ చిత్రసీమలో క్లాసిక్ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు సత్యన్ అంతికాడ్. ఆయన దర్శకత్వంలో నటుడు మోహన్ లాల్, సంగీత్ ప్రతాప్ కలిసి నటించిన ఈ చిత్రం  'హృదయపూర్వం'. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈచిత్రం ఈ రోజు ( ఆగస్టు 28 తేదీన )  థియేటర్లలోకి అడుగుపెట్టింది.  బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుందా..?  లాలెట్టన్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం లభించిందా.?   మాలవిక మోహనన్ నట ఆకట్టుకుందా? కథపై అభిమానులు ఏమంటున్నారో చూద్దాం..

'హృదయపూర్వం' రిలీజ్ తో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది . థియేటర్లలో బొమ్మ పడగానే పూలవర్షం కురిపించారు . ఈ సినిమాపై  విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక సాధారణ ఫ్యామిలీ కథను, ఎక్కడా డ్రామాకు తావు ఇవ్వకుండా, చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించడంలో సత్యన్ అంతికాడ్ మరోసారి తన మార్కు చూపించారని ప్రేక్షకులు  సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  ప్రేక్షకుల ముందుకు రాగానే విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. లాలెట్టన్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఇది సరైన ఫలితాన్ని ఇచ్చిందని తొలి సమీక్షలు చెబుతున్నాయి. ఒక సాధారణ ఫ్యామిలీ కథను, ఎక్కడా డ్రామాకు తావు ఇవ్వకుండా, చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించడంలో సత్యన్ అంతికాడ్ మరోసారి తన మార్కు చూపించారు.

మోహన్ లాల్, సంగీత్ ప్రతాప్ ల కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి కాంబో అదుర్స్ అని ట్వీట్ చేశారు. ఇద్దరి మధ్య హాస్య సన్నివేశాలు, భావోద్వేగపూరిత సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థియేటర్లో నవ్వుల పూల వర్షం కురిపించాయని ఒకరు ట్విట్ చేశారు. మలయాళీ బ్యూటీ మాలవిక మోహనన్ కూడా సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

 ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ కాంబినేషన్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, 'హృదయపూర్వం' కేవలం ఒక డ్రామా మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఎప్పటికప్పుడు నవ్విస్తూ, ఎంటర్టైన్ చేస్తూ సాగిందని చాలామంది విశ్లేషకులు ప్రశంసించారు.

సినిమాలోని స్క్రీన్ ప్లే, దర్శకత్వం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ , సినిమాటోగ్రఫీ అన్నీ ఉన్నత ప్రమాణాలతో ఉన్నాయని ప్రేక్షకులు రివ్యూ చేస్తున్నారు. ఎక్స్ వేదకిగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.  ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్ చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథనం ఎక్కడా పట్టు కోల్పోకుండా, వేగంగా సాగడం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందంటున్నారు. సంగీతం , కెమెరా పనితం అన్నీ అద్బుతంగా ఉన్నాయని ఎక్స్ లో చెప్పుకొచ్చారు.

 

అయితే, ఈ సినిమా రివ్యూలలో అత్యంత ప్రత్యేకమైన విషయం, మోహన్ లాల్ కు ఇచ్చిన టైటిల్ కార్డ్. 'ఎంపురాన్', 'దృశ్యం', 'నేరు', 'నారన్', 'నరసింహం' వంటి ఆయన ఐకానిక్ చిత్రాల పేర్లను 'రసతంత్రం' సినిమా నేపథ్య సంగీతంతో కలిపి చూపించడంతో అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.

మోహన్ లాల్, మాళవిక మోహనన్ లతో పాటు సంగీత్ ప్రతాప్, సంగీత, మీరాజాస్మిన్, సిద్ధిఖీ, నిషాన్, బాబూరాజ్, లాలూ అలెక్స్, జనార్ధనన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథను అఖిల్ సత్యన్, స్క్రీన్ ప్లే, మాటలు, సోనూ టి.పి., సినిమాటోగ్రఫీ అను ముత్తేదత్ అందించారు., తమిళ సినీ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.. ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు.

ఇక ఈ సినిమా రెండో భాగం కూడా ఇదే స్థాయిలో ఉంటే, 'హృదయపూర్వం' ఈ ఏడాది మోహన్ లాల్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు 'హృదయపూర్వం' సరైన ఎంపిక అని సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నాడు.