
కరీంనగర్: రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలతో లోయర్ మానేరు డ్యామ్ ( ఎల్ఎండీ)కు వరద ఉధృతి భారీగా పెరిగింది. మిడ్ మానేరు గేట్ల ద్వారా 45 వేల క్యూసెక్కులు, మోయ తుమ్మెద వాగు ద్వారా 26 వేల 658 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యామ్‌కు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టులోకి 71 వేల 658 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
Also Read : సిద్ధిపేట జిల్లాలో వర్ష బీభత్సం
ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 920 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 907.75 అడుగుల వద్ద ఉంది. ఎల్ఎండీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా డ్యామ్ ప్రస్తుత నీటి నిల్వ 14.762 టీఎంసీలుగా ఉంది. డ్యామ్‌కు వరద పొటెత్తడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. డ్యామ్ పరిసర ప్రాంతాల వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.