విశాఖ: గాజువాక వినాయక విగ్రహం దగ్గర ఛీటింగ్.. నిర్వాహకులు అరెస్ట్

విశాఖ: గాజువాక వినాయక విగ్రహం దగ్గర ఛీటింగ్.. నిర్వాహకులు అరెస్ట్

విశాఖలో భక్తి ముసుగులో  మోసానికి తెగబడ్డారు కొందరు యువకులు.  భారీ గణనాధుడు పేరుతో భక్తులను ఛీటింగ్​ చేశారు.  నియమ నిబంధలను ఉల్లంఘిస్తూ.. గాజువాక  లంక గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గర నిర్వాహకులు టికెట్​ వ్యవస్థను ప్రవేశపెట్టారు.  దర్శనం టికెట్లు... పార్కింగ్​ టికెట్స్​ అమ్ముతూ.. జనాలను దోచుకుంటున్నారు.  సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసఉకొని దర్శనాలను నిలిపివేశారు.  గణేష్ మండపాల వద్ద ఎటువంటి కమర్షియల్ టికెట్స్ ఉండకూడదని విశాఖ పోలీసులు  ఆంక్షలు విధించారు.