Good Food: చాక్లెట్..చీజ్ తింటే గుండె జబ్బులు రావట..!

Good Food:  చాక్లెట్..చీజ్ తింటే గుండె  జబ్బులు రావట..!

వీగన్​, కీటో, బుద్దా బౌల్​... ఇలా డైట్​ ఏదైనా సరే చీజ్, చాక్లెట్ వెతికినా కనిపించవు. కాస్త ఒళ్లు చేస్తే చాలు వీటిని పూర్తిగా పక్కనపెట్టేస్తారు. కానీ, గుండె ఆరోగ్యానికి చీజ్, చాక్లెట్​ని మించిన బెస్ట్ మెడిసిన్ మరొకటి లేదట. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడతాయని యూనివర్సిటీ ఆఫ్ నేపుల్స్ స్టడీ చెప్తోంది.

ఆరోగ్యం పేరుతో చాలామంది చీజ్, చాక్లెట్స్ కి దూరంగా ఉంటారు. కానీ, యూనివర్సిటీ ఆఫ్ నేపుల్స్ చేసిన కార్డియోవాస్క్యులర్ స్టడీ మాత్రం చీజ్, చాక్లెట్ ని డైట్ లో చేర్చాల్సిందే అంటోంది. వీటిల్లో బోలెడు ఆరోగ్యం దాగుందని చెబుతున్నారు రీసెర్చర్లు. చీజ్, చాక్లెట్స్ తినడం వల్ల కార్డియోవాస్క్యులర్ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చని ఈ స్టడీలో తేలింది. ఈ స్టడీ ప్రకారం రోజుకి యాభై గ్రాములు చీజ్, 20 నుంచి 45 గ్రాముల చాక్లెట్ తింటే గుండెకి చాలా మంచిది. అంతేకాదు రోజుకి రెండు వందల గ్రాముల డైరీ ప్రొడక్ట్స్ ని తినొచ్చట.

చీజ్, పెరుగు తయారీలో ఉండే ఫర్మంటేషన్ ప్రాసెస్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఉంటే ఫ్లేవనోల్స్ కూడా గుండెకి మేలు చేస్తాయి. చాక్లెట్స్ కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని చెప్పింది ఈ స్టడీ. కానీ, ఏ చాక్లెట్ బెస్ట్ అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇంతకుముందు జరిగిన స్టడీ రిజల్ట్స్ చూస్తే డార్క్ చాక్లెట్స్ గుండెకి చాలా మంచివి. వీటిల్లోని ఫ్లేవనోల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర న్యూట్రియంట్స్ గుండెకి మేలు చేస్తాయి.