క్యాతనపల్లి మున్సి పాలిటీలోని సింగరేణి ఉద్యోగి ఇంట్లో 20 తులాల బంగారం చోరీ

క్యాతనపల్లి మున్సి పాలిటీలోని సింగరేణి ఉద్యోగి ఇంట్లో  20 తులాల బంగారం చోరీ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి జీఎంఆర్​ టౌన్​షిప్​లో ఉన్న ఓ సింగరేణి ఉద్యోగి ఇంట్లో దొంగలుపడి 20తులాల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. టౌన్​షిప్​కు చెందిన అమీర్​ఖాన్ శాంతిఖని గనిలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి గోదావరిఖనిలో ఉన్న తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి పొద్దుపోయాక తిరిగి వచ్చాడు. 

ఇంటి మొయిన్ ​డోర్​పక్కనున్న గ్రిల్​తొలగించి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 20తులాల బంగారు అభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. శుక్రవారం రామకృష్ణాపూర్​ పోలీసులకు సమాచారం అందించగా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్​కుమార్, మందమర్రి సీఐ పర్స రమేశ్​అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అమీర్​ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తుజరుగుతోంది.