
సిద్దిపేట రూరల్, వెలుగు: పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట డిస్ట్రిక్ట్ అడిషనల్ ఫస్ట్ సెషన్స్ కోర్టు జడ్జి జయప్రసాద్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. సీపీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన దరిపల్లి విఠల్ 2018, జూన్ లో దుబ్బాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన బంధువైన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేసి చార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదనల తర్వాత విఠల్ కు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు