బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏండ్ల శిక్ష

బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏండ్ల శిక్ష

 జగిత్యాల టౌన్,  వెలుగు: నాలుగు సంవత్సరాల బాలికపై లైంగికదాడి చేసిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, 5వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ. 3లక్షలు చెల్లించాలని మంగళవారం జగిత్యాల జడ్జి నీలిమ తీర్పునిచ్చారు. 2020లో జగిత్యాల రూరల్ పరిధిలోని కండ్లె రమేశ్​ బాబు అదే గ్రామానికి చెందిన ఓ బాలికను కిరాణం షాప్ కు వెళ్లి టమాటాలు కొనుక్కు రావాలని పిలిచాడు. 

ఇంట్లోకి వచ్చిన ఆమెపై లైంగికదాడి చేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలిక సోదరుడు అరవగా నిందితుడు పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి జగిత్యాల రూరల్ ఎస్సై సతీశ్​ పోక్సో కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆధారాలతో సహా నేర నిరూపణ చేయడంతో కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడికి శిక్ష పడడంలో  కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.