వెన్నెల కిశోర్ ఇంట్లో 2000 నోట్ల కట్టలు.. వైరల్ అవుతున్న ఫొటోస్

వెన్నెల కిశోర్ ఇంట్లో 2000 నోట్ల కట్టలు.. వైరల్ అవుతున్న ఫొటోస్

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలుగా 2000 నోట్లు కనిపించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను స్వయంగా మంచు విష్ణు షేర్ చేయడం మరో విశేషం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవలే భారత ప్రభుత్వం 2000 రూపాయల నోట్లను బ్యాన్ చేస్తూ సంచలన  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా టాలీవుడ్ నటుడు మంచు విష్ణు.. నేను వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కుప్పలు కుప్పలుగా రూ. 2000 నోట్లను చూసాను. ఆ నోట్లను చూసి ఆశ్చర్యపోయి ఫోటో తీసాను. ఆయన ఈ నోట్లను ఎం చేస్తారో అంటూ ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ ఫోటో కాస్త వైరల్ అవడంతో దానిపై వెన్నెల కిషోర్ స్పందిస్తూ... నామీద పడతారేంటీ అంటూ కామెంట్ చేశాడు. 

అయితే.. మంచు విష్ణు షేర్ చేసిన ఈ ఫోటోలు నిజమేనా? లేక వెన్నెల కిషోర్ ను ఆటపట్టించడానికి ఇలా చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మంచు విష్ణు, వెన్నెల కిషోర్ ముందు నుండే మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెల్సిందే.