2018 OTT Release:ఓటీటీలోకి వచ్చేస్తున్న 2018.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

2018 OTT Release:ఓటీటీలోకి వచ్చేస్తున్న 2018.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రీసెంట్ మలయాళ ఇండస్ట్రీ హిట్ మూవీ 2018 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన సోనీ లివ్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. జూన్ 7న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీం చేయనున్నట్లు ప్రకటించింది. అంటే విడుదలైన 34 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. రీసెంట్ టైమ్స్ లో ఒక ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమా ఇంత తోందరగా ఓటీటీలోకి రావడం ఇదే మొదటిసారి అవడం విశేషం.

ఇక ఈ సినిమాని చూడటానికి ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన 2018 మూవీ మే 5న విడుదలై మాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2018లో కేరళలో వరదలు బీబత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే కాన్సెప్ట్ తో దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ ఒక అద్భుతమైన కథని ప్రేక్షకులకు చూపించాడు. కేరళ ప్రేక్షకులు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

ఈ సినిమాకు వచ్చిన రెపాన్స్ చూసి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చార. తెలుగులో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే 4 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. మరి ధియేటర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ హిట్ కానుందో తెలియాలి అంటే జూన్ 7 వరకు ఆగాల్సిందే.