2021 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియాలోనే

2021 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియాలోనే

వుమెన్స్‌ వన్డే వరల్డ్‌‌కప్‌ 2022కు పోస్ట్‌పోన్
2022 ఆస్ట్రేలియాలో..

దుబాయ్‌: ఐసీసీ వరల్డ్‌కప్స్‌‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. షెడ్యూల్‌‌ ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌‌కు ఇండియానే ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈరైట్స్‌‌ కోసం క్రికెట్‌‌ ఆస్ట్రేలియా (సీఏ) కూడా పోటీపడినా.. చివరకు బీసీసీఐ తన పంతాన్ని నెగ్గించుకుంది. ఈ ఏడాది పోస్ట్‌పోన్‌‌ అయిన టీ20 వరల్డ్‌కప్‌‌ను 2022లో ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు గవర్నింగ్‌‌బాడీ ఓకే చెప్పింది. అయితే 2021లో న్యూజిలాండ్‌‌లో జరగాల్సిన వుమెన్స్‌ ‌వన్డే వరల్డ్‌కప్‌‌ను 2022 ఫిబ్రవరి–మార్చికి పోస్ట్‌పోన్‌ ‌చేశారు. కరోనావైరస్‌ నేపథ్యంలో వాయిదా అనివార్యమైంది. వరల్డ్‌వైడ్‌‌గా నెలకొన్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత హెల్త్‌‌, క్రికెట్‌ అండ్‌‌ కమర్షియల్ ఇంపాక్ట్ ను దృష్టిలోష్టి పెట్టుకుని ఐబీసీ (ద కమర్యల్‌‌ షి సబ్సిడరీ ఆఫ్‌‌ద ఐసీసీ) బోర్డు ఈ నిర్ణయాలు తీసుకుంది. ‘గ్లోబల్‌‌ ఈవెంట్స్‌‌ను ఎలా నిర్వహించాలనే దానిపై మేం కొన్ని నెలలుగా సమీక్షలు జరుపుతున్నాం. ప్రతి ఒక్కర్ని సేఫ్‌‌గా, సురక్షితంగా ఉంచాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. క్రికెట్‌ , మా పార్టనర్స్, ఫ్యాన్స్‌‌ ఇంట్రెస్ట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నాం’ అని ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌ ‌ఇమ్రాన్‌ ‌ఖవాజ వెల్లడించారు.

For More News..

మన్‌ప్రీత్‌కు కరోనా పాజిటివ్