టాటా కొత్త కారు : నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో.. రూ.13 లక్షల్లోనే హై ఎండ్

టాటా కొత్త కారు : నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో.. రూ.13 లక్షల్లోనే హై ఎండ్

టాటా నుంచి కొత్త మోడల్ కారు వచ్చింది. నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో మార్కెట్ లోకి రిలీజ్ చేసింది కంపెనీ.. 2023, సెప్టెంబర్ 14వ తేదీ కారును రిలీజ్ చేయటంతోపాటు.. ధర, ఇతర వివరాలను ప్రకటించింది.  నెక్సాస్ ఫేస్ లిఫ్ట్ కారు మోడల్ అద్దరిపోయింది.. లుక్ సూపర్ గా ఉంది. మిడ్ రేంజ్ SUVగా కనిపిస్తుంది. మహీంద్రా 300 ఎస్ యూవీ లుక్ ఉంది.  ఇక ధర విషయానికి వస్తే ప్రారంభం ధర 8 లక్షలుగా ఫిక్స్ అయ్యింది. హై ఎండ్ మాత్రం 13 లక్షల రూపాయలుగా ప్రకటించింది కంపెనీ. ఇది ఎక్స్ షోరూం ధర. 

డిజైన్ విషయానికి వస్తే.. 

ఇంటీరియల్, డిజైన్‌లో భారీ మార్పులను ఆ సంస్థ చేసింది. 2023 టాటా నెక్సాన్ ఈవీలో ఎక్స్‌టీరియల్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిద్దారు. ఫ్రెంట్‌లో స్ల్పిప్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్స్​, సీక్వెన్షియల్​ టర్న్​ ఇండికేటర్స్​ వంటివి నూతనంగా మార్పు చేశారు. బంపర్స్ కు వర్టికల్ స్ట్రౌట్స్ రానున్నాయి. 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ను కూడా కొత్త డిజైన్ ను ఏర్పాటు చేశారు.

ఫ్యూచర్స్  పరిశీలిస్తే..

టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​లో 12.3 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 10.25 ఇంచ్​ ఫుల్లీ డిజిటల్​ ఉన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, టచ్​ ఆధారిత ఎయిర్​కాన్​ ప్యానెల్​ వంటివి వస్తున్నాయి. సెంటర్​ కన్సోల్​ని కూడా రీడిజైన్​ చేశారు. ఇందులో డ్రైవర్​ మోడ్​ సెలక్టర్​, వయర్​లెస్​ ఛార్జింగ్​ పాడ్​ వంటివి లభిస్తున్నాయి. ఇక ఈ 5 సీటర్​ ఎస్​యూవీ కేబిన్​లో 6 ఎయిర్​బ్యాగ్స్​, హిల్​-డిసెంట్​ కంట్రోల్​, 360డిగ్రీ వ్యూ కెమెరా, ఈఎస్​పీ వంటివి స్టాండర్డ్​గా వస్తున్నాయి.

ఇంజిన్ సామర్ధ్యాన్ని తీసుకుంటే...

కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్, కర్వ్ పెట్రోల్ కాన్సెప్ట్ ఆధారంగా కొత్త ఇంజన్‌ను అందించారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నెక్సాన్ కంటే మరింత శక్తివంతమైన, మెరుగైన మైలేజీని ఆశించవచ్చు. లోపలి భాగంలో చూసినట్లుయితే కొత్త నెక్సాన్ చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులో అనేక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది అత్యంత ఎక్కువ పోటీ ఉన్న విభాగంలో కంపెనీని టాప్ పొజిషన్‌లో ఉంచడానికి పని చేస్తుంది.