
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసికట్టుగా పోరాడకుంటే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 2023 ఎన్నికలే చివరి ఎలక్షన్లు అవుతాయన్నారు. రత్లాం జిల్లాలో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ కార్యకర్తలను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలతో విడివిడిగా సమావేశమై చర్చించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిజాయితీగా పోరాడలేని నేతలు ఇళ్లల్లో కూర్చోవాలన్నారు. సమిష్టిగా అందరూ ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలని లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాదని అన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వార్తల కోసం