యూపీలో రేపు మూడో విడత పోలింగ్

యూపీలో రేపు మూడో విడత పోలింగ్

లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఆదివారం మూడో విడత పోలింగ్ పోలింగ్ జరగనుంది. 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ స్థానానికి కూడా ఈ దశలోనే ఓటింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పోటీ చేయడం ఇదే తొలిసారి. మూడో విడతలో ఎన్నిక జరగనున్న 59 నియోజకవర్గాల్లో 627 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. వారిలో 96 మంది మహిళలు ఉన్నారు.

మూడో దశలో 2కోట్ల 15 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో కోటీ 16లక్షలకుపైగా పురుష ఓటర్లు కాగా.. 99 లక్షలకుపైగా మహిళా ఓటర్లు ఉన్నారు. వెయ్యి మందికిపైగా ట్రాన్స్జెండర్లు ఈ దఫా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2017లో ఈ 59 స్థానాల్లో బీజేపీ 49 గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ కేవలం 9సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క సీటు దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. రేపు జరగనున్న మూడో దశతో కలుపుకుని యూపీలో మొత్తం 172 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి కానుంది. మార్చి 7న జరగనున్న ఏడో దశతో యూపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తికానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.

For more news..

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోట్లే

పోలీసులను ఆశ్రయించిన సినీ రచయిత చిన్ని కృష్ణ