మల్టీమీడియా ఫీచర్స్తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

మల్టీమీడియా ఫీచర్స్తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

2024లో బజాజ్ ఆటో కంపెనీ రెండు ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్లను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. బజాజ్ చేతక్ అర్బేన్, బజాజ్ చేతక్ ప్రీమియం. ఈ రెండు వేరియంట్లు వివిధ కలర్లు, మల్టీమీడియా ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఈ వెర్షన్లలో ఆప్ డేటెట్ ఫీచర్లు, వాటి ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.. 

బజాజ్ ఆటో తన టూవీలర్ ఫోర్ట్ ఫోలియోకి కొత్త వేరియంట్లను చేర్చింది. 2024లో భారతీయ మార్కెట్  అంతటా రెండు అప్ డేట్ చేసిన ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్ మోడళ్లను విడుదల చేసింది. ఈ ఎడిషన్ లో TecPac అనే ఫీచర్ తో వస్తోంది. ఇది కస్టమర్లకు అనేక ఆకర్షణీయమైన మల్టీమీడియా ఫీచర్లను అందిస్తుంది. ఈ TecPac ద్వారా టర్న్ - బైక్ - టర్న్ నావిగేషన్, హిల్ హోల్డ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ వంటి ఫీచర్లు కస్టమర్లకు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. TecPac మరొక టాప్ ఫీచర్ రివర్స్ మోడ్.. ఇది ప్రీమీయం చేతక్ లో మాత్రమే ఉంటుంది. 

స్పీడ్ విషయానికొస్తే గంటకు 73 కిలోమీటర్ల వేగంతో బజాజ్ చేతక్ ను రైడ్ చేయొచ్చు. అయితే ఇది స్టాండర్డ్ మోడ్ లో కేవలం 63 కిలోమీటర్లు మాత్రమే. TecPac  ప్యాకేజీ బజాజ్ చేతక్.. అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

2024 సరికొత్త చేతక్ లో అత్యంత హైలైట్ చేయబడిన ఫీచర్ 5 అంగుళాల TFYT స్క్రీన్. ఇది ఇంతకు ముందు వెర్షన్లలో లేదు. తాజా మోడల్ 3.2 KWh బ్యాటరీ ప్యాక్ తో కూడా వస్తుంది. ఇది గరిష్టంగా ఒకసారి ఛార్జింగ్ పెడితే 27 కి.మీలు ప్రయాణం చేయొచ్చు. అదే ప్రీమియం వెర్షన్ లో అధిక పవర్ 800 W ఛార్జర్  ఉంటుంది. ఇది కేవలం 30 నిమిషాల్లో 15.6 కి.మీ పరిధఇని అందిస్తుంది. 

ఇంకా కొత్త వెర్షన్లలో రాత్రి సమయాల్లో ప్రయాణించేందుకు మంచి ఫీచర్లు ఉన్నాయి.ఎలక్ట్రానిక్ హ్యాండిల్, స్టీరింగ్ తాళాలు, సీటు స్విచ్ లు , ఎడమ, కుడి ఇండికేటర్ స్విచ్ లు, బ్లింకర్లు, హెల్మెట్ బాక్సు లోపల లైట్ ఉంటాయి. అర్బేన్ ట్రిమ్ నాలుగు రంగులలో లభిస్తుంది. సైబర్ వైట్, ముతక గ్రే, బ్రూక్లిన్ బ్లాక్, ఇండిగో మెటాలిక్ బ్లూ.  అదే బజాజ్ చేతక్ ప్రీమియం.. హాజెల్ నట్, ఇండిగో బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. 

  • బజాజ్ చేతక్ అర్బేన్ ధర రూ. 1లక్ష
  • బజాజ్ చేతక్ ప్రీమియం ధర రూ. 1.35 లక్షలు.