OTT Top5 Series: ఓటీటీల్లో టాప్ 5 వెబ్ సిరీస్లివే.. ఉత్కంఠ రేపే కథనాలతో హయ్యెస్ట్ వ్యూస్

OTT Top5 Series: ఓటీటీల్లో టాప్ 5 వెబ్ సిరీస్లివే.. ఉత్కంఠ రేపే కథనాలతో హయ్యెస్ట్ వ్యూస్

ఈ మధ్యకాలంలో ఓటీటీ సినిమాలతో ఆడియన్స్ బాగా ఎంటర్ టైన్ అవుతున్నారు. ఒక్కో ఓటీటీల్లో ఒక్కో తరహా సినిమా వస్తుండటంతో ప్రత్యేకంగా 'ఓటీటీ ఫ్యాన్స్' సైతం ఏర్పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ డేటా ప్రకారం, ఇండియాలో 57కి పైగా OTTప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

అందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు జియో సినిమా, ఆహా, ఈటీవీ విన్, Zee5,SonyLIV మరియు Hoichoi వంటి అనేక ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో వచ్చే సినిమాల కోసం ఆడియన్స్ ఎప్పటికప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, కొంతకాలంగా ఆర్మాక్స్ మీడియా అనే సంస్థ సినిమాల సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా ఓటీటీల్లో ప్రతి వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో (ఆగస్ట్ 18 నుంచి 24) మధ్య గల హయ్యెస్ట్ వ్యూస్ సంపాదించిన టాప్ 5 వెబ్ సిరీస్ లను ప్రకటించింది. ఈ లిస్టులో మన తెలుగు వెబ్ సిరీస్ కూడా ఉండటం విశేషం. మరి ఆ సినిమాలేంటో? ఏ సినిమా ఎంత వ్యూస్ సాధించాయనేది చూద్దాం 

గత వారం టాప్ 5 వెబ్ సిరీస్లు:

1. సారే జహాన్ సే అచ్చా- 2.8 మిలియన్ వ్యూస్ (నెట్‌ఫ్లిక్స్‌)- ఆగస్టు 13

2. వెడ్నెస్ డే (సీజన్2) -2.4 మిలియన్ల వ్యూస్ (నెట్‌ఫ్లిక్స్‌)- ఆగస్టు 6

3. సలాకార్- 2.2 మిలియన్ల వ్యూస్ (జియో హాట్‌స్టార్)- ఆగస్టు 8

4. అంధేరా - (సీజన్1) - 1.9 మిలియన్ల వ్యూస్ (ప్రైమ్ వీడియో)-ఆగస్టు 14

5. మయసభ-  1.8 మిలియన్ల వ్యూస్ (SonyLIV)-ఆగష్టు 7

'సారే జహాన్ సే అచ్చా' వెబ్ సిరీస్:

‘సారే జహాన్ సే అచ్చా’ సిరీస్ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ఈ సిరీస్ గత వారం 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా ఆ ట్రెండింగ్ కొనసాగిస్తూనే ఉంది. ఇదొక దేశభక్తిని చాటిచెప్పే స్పై థ్రిల్లర్ సిరీస్. ఇందులో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ఏజెంట్ విష్ణు శంకర్ కథను చూపించారు. ఇతను ప్రపంచాన్ని అణు యుద్ధం నుండి కాపాడే భారతీయ గూఢచారిగా పేరుపొందారు. ప్రతీక్ గాంధీ లీడ్ రోల్లో నటించాడు.

స్పై థ్రిల్లర్ కథాంశం:

1970ల నాటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఒక చిన్న పొరపాటు అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉన్న సమయంలో ఈ స్పై థ్రిల్లర్ కథ సాగుతుంది. ఈ సిరీస్ లో భారత రా ఏజెంట్ విష్ణు పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ ముర్తాజా మాలిక్ ను ఓడించడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో సమయం తక్కువగా ఉండటంతో, ప్రపంచాన్ని నాశనం చేయగల రహస్య అణు ప్రణాళికను ఆపడానికి విష్ణు శత్రు భూభాగంలోకి వెళ్తాడు.  ఇతను పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ప్రమాదకరమైన మిషన్ ను ఎలా పూర్తి చేశాడు? అందులో విజయం సాధించాడా? అన్నదే ఈ కథాంశం. 

మయసభ:

స్నేహం, రాజకీయాలు, వైరం.. ఈ మూడింటిని కలగలపి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ' మయసభ' ( Mayasabha ). సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తికరమైన పోలిటికల్ డ్రామాతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే గత వారం కూడా టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకుంది. గత వారం ఈ సిరీస్ కు 1.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల రాజకీయలను ప్రభావితం చేసేలా దేవకట్ట, కిరణ్ జయకుమార్ ఈ కథను ఎలా తీర్చిదిద్దారు. ఇందులో తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మలుపు తిప్పిన నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల జీవితాలను ప్రధానంగా చూపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావులతో పాటు సాయి కుమార్, దివ్య దత్తా, నాజర్, రవీంద్ర విజయ్, శత్రు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.