గువహటి: కేంద్ర బడ్జెట్ సంస్కరణల దిశగా సాగే బడ్జెట్ అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రశంసించారు. అస్సాంతో పాటు మొత్తం ఈశాన్య ప్రాంతానికి లబ్ధి కలుగుతుందని ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్ పెట్టారు. “వికసిత్ భారత్ బడ్జెట్‌ను సమర్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలకు అభినందనలు. హెల్త్‌కేర్, ఏఐ, ఇతర అనుబంధ రంగాల్లో అస్సాంను గ్లోబల్ హబ్‌గా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి కేంద్ర బడ్జెట్‌లోని నైపుణ్యాభివృద్ధి కేటాయింపులు తోడ్పడతాయి” అని హిమంత పేర్కొన్నారు.
