వెంటిలేటర్లు ఉన్నవి 20 వేలే.. 2 లక్షలు కావాలి

వెంటిలేటర్లు ఉన్నవి 20 వేలే.. 2 లక్షలు కావాలి

ప్రపంచాన్ని కరోనా ఆగమాగం చేస్తోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బాధితులకు చికిత్స అందించేందుకు సరిపడా మెడికల్ ఎక్విప్ మెంట్ లేక చాలా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేసేందుకు వెంటిలేటర్ల అవసరం ఎంతో ఉంది. అయితే ఇప్పుడు చాలా దేశాల్లో సరిపడా వెంటిలేటర్లు లేవు. అగ్రరాజ్యం అమెరికాలోనే వెంటిలేటర్ల సమస్య వేధిస్తోంది. న్యూయార్క్ రాష్ట్రంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బాధితులకు సరిపడా వెంటిలేటర్లు లేకపోవడంతో ఎవరికి ముందుగా వెంటిలేటర్ పై చికిత్స అందించాలనే దానికోసం లాటరీ తీయాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. వైరస్ బారి నుంచి బతికి బయటపడతారనుకునే వారికే వెంటిలేటర్ సదుపాయం కల్పించాలని ఆలోచిస్తున్నారు. ఇటలీ, స్పెయిన్​లోనూ ఇలాంటి దారుణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మన దేశం ముందుగానే జాగ్రత్త పడుతోంది. వెంటిలేటర్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

2 లక్షలు అవసరం…

మన దేశంలో సాధారణంగా ఏటా 8వేల వెంటిలేటర్ల అవసరం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా ఎఫెక్ట్ తో వెంటిలేటర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనా కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే, దారుణమైన పరిస్థితులు ఏర్పడితే మే 15 వరకు 1,10,000 నుంచి 2,20,000 వరకు వెంటిలేటర్లు అవసరమవుతాయని ‘‘థింక్ టాంక్ బ్రూకింగ్స్ ఇండియా’’ సంస్థ అంచనా వేసింది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,220 ఐసీయూ వెంటిలేటర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా కరోనా చికిత్సల కోసం కేటాయించిన హాస్పిటళ్లలో మరో 6వేల వెంటిలేటర్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

మూడు సంస్థలు ముందుకు…

కరోనా పరిస్థితిని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం వెంటిలేటర్ల తయారీకి తగిన చర్యలు తీసుకుంటోంది. వీటి తయారీకి సహకరించాలని కార్పొరేట్ కంపెనీలను కోరింది. ఈ మేరకు మూడు కార్పొరేట్ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా ముందుకొచ్చాయి. వెంటిలేటర్ల తయారీకి ఈ మూడు సంస్థలూ ప్లాన్ చేస్తున్నాయి. ‘‘వెంటిలేటర్ల తయారీకి మేం చర్యలు తీసుకుంటున్నాం. పీఎస్ యూలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 30వేలు, హెచ్ ఎల్ఎల్ లైఫ్​ కేర్ లిమిటెడ్ 10 వేల వెంటిలేటర్లను తయారు చేయనున్నాయి” అని సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కూడా వెంటిలేటర్ల తయారీకి కృషి చేస్తోంది. రూ.7,500కే అధునాతమైన వెంటిలేటర్ అందించేందుకు కృషి చేస్తున్నామని పోయిన వారమే మహీంద్రా గ్రూప్ వెల్లడించింది.

స్కాన్ రేతో కలిసి ఉత్పత్తి…

వెంటిలేటర్ల తయారీకి సంబంధించి కర్నాటకకు చెందిన మెడికల్ ఎక్విప్​మెంట్ సప్లయర్ ‘‘స్కాన్ రే టెక్నాలజీస్”… భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలతో కలిసి పని చేస్తోంది. వెంటిలేటర్ల డిజైన్​ను సింప్లిఫై చేసేందుకు బీఈఎల్​​తో కలిసి వర్క్ చేస్తోంది. వీటి డిజైన్​ను సులభతరం చేస్తే కొన్ని సమస్యలను అధిగమించి ఉత్పత్తిని వేగవంతం చేయొచ్చని స్కాన్ రే ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘‘మొదట మమ్మల్ని బీఈఎల్ సంప్రదించింది. మాకు 10 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. బీఈఎల్ డిజైనర్లు మాతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పటికే ప్రొడక్షన్ స్టార్ చేశాం” అని కంపెనీ ఎండీ విశ్వప్రసాద్ తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఇంజనీరింగ్ టీమ్ తమతో కలిసి పని చేస్తోందని, త్వరలోనే టాటా టీమ్  కూడా జాయిన్ అవుతుందని చెప్పారు.

సింగరేణి అండర్‌ గ్రౌండ్‌ గనుల్లో కరోనా భయం