ఇయ్యాల్టి (అక్టోబర్ 9) నుంచి ఆర్టీఐ 20వ వారోత్సవాలు..

ఇయ్యాల్టి (అక్టోబర్ 9) నుంచి ఆర్టీఐ 20వ వారోత్సవాలు..
  • రవీంద్రభారతిలో వేడుకలు.. చీఫ్ గెస్ట్​గా గవర్నర్

హైదరాబాద్, వెలుగు: సమాచారహక్కు చట్టం 20వ వారోత్సవాలు గురువారం హైదరాబాద్‌‌‌‌లోని రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చీఫ్ గెస్ట్​గా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరం ఆర్టీఐ విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. సమాచార హక్కు చట్టం కమిషన్​కు కొత్త కమిషనర్లు బాధ్యతలు స్వీకరించి 4 నెలలు అవుతున్నది. కొత్త కమిషన్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించింది. జనగామ, కామారెడ్డి, మెదక్, నిర్మల్, వనపర్తి, వరంగల్, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో పీఐవోలు, ప్రజలతో కలిసి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించింది. 

ఆ జిల్లాల్లో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులను విచారించి పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. 11 ఏండ్ల నుంచి పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులు కూడా కమిషన్ దృష్టికి రావడంతో, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నది. దీంతో పాటు, కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఎక్కువ కేసులు ఉన్న 12 ప్రభుత్వ శాఖల్లో పీఐవోల ప్రక్షాళన చేసింది. ఈ వేడుకల్లో గవర్నర్ చేతుల మీదుగా బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్, బెస్ట్ పీఐవో, బెస్ట్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఇన్ డిస్పోసల్ ఆఫ్ ఆర్టీఐ కేసెస్ వంటి మొత్తం 7 విభాగాల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు