మద్యం మత్తులో దంపతుల గొడవ.. చిన్నారి మృతి

V6 Velugu Posted on Sep 25, 2021

హైదరాబాద్: తల్లిదండ్రుల మద్యం మత్తు వారి చిన్నారి మరణానికి కారణమైంది. సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోనీ పూసలబస్తీలో నివసించే రాజేశ్, జాహ్నవి దంపతులు నిత్యం మద్యం సేవించి గోడవపడేవారు. శుక్రవారం కూడా ఇరువురు గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన రాజేశ్.. జాహ్నవి మీద దాడి చేశాడు. భర్త దెబ్బలు తాలలేక.. జాహ్నవి తన చేతిలోని 21 రోజుల బాబును అడ్డుపెట్టింది. దాంతో చిన్నారికి బలంగా దెబ్బ తగిలింది. చిన్నారిని ఆసుపత్రికి తలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సైదాబాద్ పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని పసికందు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని రిమాండ్‎కు తరలించారు.

ఘటన జరిగిన ప్రాంతానికి నిందితుడు రాజేశ్‎ను తీసుకెళ్లి పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ నిర్వహించారు. ఘటన జరిగిన ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధంగా గొడవ పడ్డారు, గొడవలో పసికందు ఎలా మృతి చెందాడు అని ఆరా తీశారు.

For More News..

కొట్లాట నాకు, కేసీఆర్‎కు మాత్రమే.. నాయకులతో కాదు

రైతుల భూములు కొట్టేసేందుకు బాల్క సుమన్ కుట్రలు చేస్తున్నడు

డాక్టర్ లేడని నర్సుల వైద్యం.. పుట్టిన పసికందు మృతి

Tagged Hyderabad, alcohol intoxication, baby died, Saidabad, Parents fighting, couple fighting

Latest Videos

Subscribe Now

More News