24 గంటలు.. 21 కాన్పులు..కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బంది కృషి

24 గంటలు.. 21 కాన్పులు..కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బంది కృషి

కల్వకుర్తి, వెలుగు : కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల్లో 21 కాన్పులు జరిగాయి. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన నిండు గర్భిణులకు డాక్టర్ యశోద టీమ్ డెలివరీలు చేసింది.  మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 11 నార్మల్,10  సిజేరియన్   కాన్పులు చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరామ్ తెలిపారు. 

14 మంది మగ, ఏడుగురు ఆడ పిల్లలు జన్మించినట్టు, అన్ని కాన్పుల్లో తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్టు చెప్పారు. కల్వకుర్తి ఆస్పత్రి తొలిసారిగా పెద్ద మొత్తంలో కాన్పులు చేసినట్టు పేర్కొన్నారు. డ్యూటీ డాక్టర్, వైద్య, శానిటేషన్ సిబ్బందికి కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు.